ఆధార్ కార్డుని ఫేస్ బుక్ మరియు సోషల్ మీడియా అకౌంట్లతో లింక్ చేస్తే ఏం జరుగుతుంది?

ఆధార్ కార్డుని ఫేస్ బుక్ మరియు సోషల్ మీడియా అకౌంట్లతో లింక్ చేయాలనే ఆలోచన ఎలా వచ్చింది?

 • ఆధార్ కార్డుని ఫేసుబుక్, జిమెయిల్, వాట్సాప్, యూట్యూబ్, ట్విట్టర్ మొదలైన అన్ని సోషల్ మీడియా అకౌంట్లతో లింక్ చేయమని రెండు ప్రజావాజ్యాలు మద్రాస్ హైకోర్టులో నమోదయ్యాయి.

 • ఆంటోనీ క్లెమెంట్ రూబిన్, జనని కృష్ణమూర్తి అనే జంతువుల హక్కుల కోసం పోరాడే ఇద్దరు ఈ ప్రజావ్యాజ్యాలను 2018 లో దాఖలు చేసారు.

 • మద్రాస్ హైకోర్టు తమిళనాడు ప్రభుత్వాన్ని వివరణ కోరగా దీనికి తమిళనాడు ప్రభుత్వం ఆధార్ కార్డుని సోషల్ మీడియా అకౌంట్లతో లింక్ చేయడం ద్వారా సోషల్ మీడియా లో వ్యాపించే ఫేక్ న్యూస్ ని, సైబర్ క్రైమ్స్ ని నిరోధించటానికి అవకాశం ఉంటుందని తెలిపింది.

 • దీన్ని ఫేసుబుక్ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. మద్రాస్ హైకోర్టు లో పెండింగ్ లో ఉన్న ఈ కేసులను సుప్రీం కోర్టుకు బదిలీ చేయల్సిందింగా ఫేసుబుక్ సుప్రీం కోర్టును కోరగా దీనికి సుప్రీం కోర్ట్ అంగీకారం తెలిపింది.

 • సుప్రీం కోర్ట్ దీనిపై స్పందన తెలపాల్సిందిగా ప్రభుత్వానికి, గూగుల్ కి, ట్విట్టర్ కి, మిగతా సోషల్ మీడియా కంపెనీలకు నోటీసులు పంపింది.

ఆధార్ కార్డుని ఫేసుబుక్ తో లింక్ చేస్తే జరిగే లాభాలు

 • ప్రజలను భయ భ్రాంతులకు, ఆందోళనకు గురి చేసే తప్పుడు వార్తలు మరియు పుకార్లు ఉండకపోవచ్చు.
 • ఒక వ్యకియొక్క గౌరవానికి భంగం కలిగించటానికి చేసే చెడుకరమైన, అసభ్యకరమైన ట్రోలింగ్ జరగదు.
 • సోషల్ మీడియా ద్వారా జరిగే సైబర్ క్రైమ్స్ తగ్గుతాయి.
 • మన దేశ భద్రతకు భంగం కలిగించే, మన దేశానికి వ్యతిరేకమైన కధనాలు ప్రచారం కావు.
 • సోషల్ మీడియాలో బాధ్యతాయుతమైన కంటెంట్ షేర్ చేయబడుతుంది.

ఆధార్ కార్డుని ఫేసుబుక్ తో లింక్ చేస్తే జరిగే నష్టాలు

 • ప్రభుత్వ విధానాలను ఎండకట్టేవారికి, మంచి విధానంలో విమర్శ చేసేవారికి ప్రభుత్వం నుంచి ఇబ్బందులు ఎదురవుతాయి.
 • భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకి భంగం కలుగుతుంది.
 • సోషల్ మీడియా కంపెనీలు ఆధార్ కార్డు డేటాని దుర్వినియోగం చేసే అవకాశం వుంది. ఫేసుబుక్ తన యూజర్ల డేటాని కాంబ్రిడ్జి అనలిటిక అనే కంపెనీకి అమ్మడం తాజా ఉదాహరణ.

ఫేసుబుక్ ఈ నిర్ణయాన్ని ఎందుకు వ్యతిరేకిస్తుంది?

 • ఫేసుబుక్ వాట్సాప్ ని కొనుగోలు చేసింది. వాట్సాప్ లో ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అనే సదుపాయం ఉంది. దీని వలన వాట్సాప్ లో పంపించే సమాచారం మొదట ఎవరు పంపించారు అని వాట్సాప్ కి కూడా తెలియదు.
 • ఒక వేల ఇప్పుడు సోషల్ మీడియాతో ఆధార్ కార్డుని లింక్ చేస్తే వాట్సాప్ వినియోగించే వారి సంఖ్య తగ్గిపోతుంది. ఇది ఫేసుబుక్ కి తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది.
ఇతరులకు షేర్ చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *