Facebook Account after Death in Telugu

ఈ రోజుల్లో దాదాపుగా ప్రతీ ఒక్కరు ఫేస్ బుక్ వాడుతున్నారు.

నిజం చెప్పాలంటే మనం రెండు ప్రపంచాలలో నివసిస్తున్నాము. ఒకటి భౌతిక ప్రపంచంలో, రెండోది కృత్రిమ మైన సోషల్ మీడియా ప్రపంచంలో.

మనం ఒక సంవత్సరం పాటు ఫేస్ బుక్ వాడడం మానేస్తే అందరు మనం చనిపోయామని అనుకునే రోజులివి.

ఒక వ్యక్తి మరణించినపుడు భౌతిక ప్రపంచంలో ఇక కనిపించడు.

కానీ సోషల్ మీడియా ప్రపంచంలో తన ప్రొఫైల్, ఫొటోలు ఇంకా అలానే ఉంటాయి

.మరణించిన వ్యక్తి యొక్క పుట్టిన రోజుని ఎవరైనా మర్చి పోతారేమో గాని, పేస్ బుక్ మాత్రం మర్చిపోదు.మరణించిన వ్యక్తి యొక్క పుట్టిన రోజుని తన ఫ్రెండ్ లిస్టులో ఉన్న వారికందరికి ఫేస్ బుక్ నోటిఫై చేస్తూనే ఉంటుంది, ఆ వ్యక్తి యొక్క ప్రొఫైల్ ని ఇతరులకు రికమెండ్ చేస్తూనే ఉంటుంది.కొత్త వాళ్ళు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తూనే వుంటారు.

ఆ వ్యక్తి యొక్క మరణం గురించి తెలియని వారంతా ఫేస్ బుక్ ద్వారా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతారు, సందేశాలు పంపిస్తారు.కానీ ఎటువంటి స్పందన ఉండదు.

సందేశాలు పంపిన వారంతా వీడికి పొగరెక్కువ అసలు రిప్లై ఇవ్వట్లేదు అనుకుంటారు.

ఒక వ్యక్తి మరణించినపుడు ఫేస్ బుక్ లో తన ప్రొఫైల్ డిలీట్ అవ్వాలన్న, తన బర్త్ డే ఇతరులకు నోటిఫై అవ్వకుండా ఉండాలన్నా, ఫ్రెండ్ రెకమెండేషన్ లో తన ప్రొఫైల్ కనిపించకుండా ఉండాలన్నా, కొత్త ఫ్రెండ్ రిక్వెస్ట్ లు రాకుండా ఉండాలన్నా ఏమి చేయాలో తెలుసుకుందాం.

  1. ఫేస్ బుక్ సెట్టింగ్స్ (Settings) ఓపెన్ చేయాలి.

  • జనరల్ అకౌంట్ సెట్టింగ్స్ పై (General Account Settings) క్లిక్ చేయాలి.
  • Memorialization Settings పైన క్లిక్ చేయాలి.
  • legacy contact ని choose చేసులోవాలి.

legacy contact అంటే ఒక వ్యక్తి మరణించిన తర్వాత తన ఫేస్ బుక్ అకౌంట్ ని మైంటైన్ చేయడానికి స్నేహితులలో, కుటుంబ సభ్యులలో ఎవరి నైనా ఒకరిని సెలెక్ట్ చేసుకోవాలి.

legacy contact గా ఉన్న వారు మరణించిన వ్యక్తి యొక్క ఫేస్ బుక్ అకౌంటుకి పూర్తి access ఉండదు కానీ ఈ కింద తెలిపినవి మాత్రం చేయగలడు.

  • ప్రొఫైల్ మైంటైన్ చేయడానికి ఇష్టం లేకపోతే ఫేస్ బుక్ అకౌంట్ ని డిలీట్ చేయగలడు.
  • మరణించిన వ్యక్తి యొక్క ప్రొఫైల్ లో మరణ వార్తను, నివాళులు తెలుపుతూ pinned పోస్ట్ లు చేయగలడు.
  • ప్రొఫైల్ పిక్చర్ ని, కవర్ ఫోటో ని అప్డేట్ చేయగలడు.
  • కొత్తగా వచ్చే ఫ్రెండ్ రిక్వెస్ట్ లను accept చేయగలడు.
  • మరణించిన వ్యక్తి యొక్క tagged in పోస్టులను remove చేయగలడు.
  • మరణించిన వ్యక్తి యొక్క ప్రైవేట్ messages ని, పోస్టులను legacy contact చూడలేడు.

ఒక వేల మరణించిన తర్వాత అకౌంట్ డిలీట్ అయిపోవాలంటే Request that your account be deleted after you pass away క్లిక్ చేయండి.

యూజర్ మరణించాడని ఫేస్ బుక్ కి ఎలా తెలుస్తుంది?

కుటుంబ సభ్యులు గాని, స్నేహితులు గాని వ్యక్తి మరణాన్ని తెలియచేస్తు, చనిపోయినట్టు ఆధారాలు చూపిస్తూ (డెత్ సర్టిఫికెట్) ఫేస్ బుక్ కి Memorialization Request రిక్వెస్ట్ పంపించాలి.

  • అన్ని వివరాలు ఫేస్ బుక్ వివరంగా పరిశీలించిన తర్వాత చనిపోయిన వ్యక్తి యొక్క అకౌంట్ ని memorialized అకౌంట్ గా మారుస్తుంది.
  • memorialized account గా మారిన తర్వాత ఫేస్ బుక్ సెర్చ్ లో ప్రొఫైల్ కనిపించదు.
  • ప్రొఫైల్ నేమ్ ముందు Remembering అనే పదం చేర్చబడింది.
  • చనిపోయిన వ్యక్తి తన ప్రొఫైల్ సెట్టింగ్స్ లో legacy contact ని రిజిస్టర్ చేసివుంటే legacy contact కి చనిపోయిన వ్యక్తి యొక్క ఫేస్ బుక్ అకౌంట్ ని మైంటైన్ చేయమని ఫేస్ బుక్ మెసేజ్ పంపిస్తుంది.
  • ఒక వేల చనిపోయిన వ్యక్తి తన ప్రొఫైల్ సెట్టింగ్స్ లో చనిపోయిన తర్వాత అకౌంట్ డిలీట్ అవ్వాలని choose చేసుకుని ఉంటే అకౌంట్ డిలీట్ అయిపోతుంది.

ఒక వేల చనిపోయిన వ్యక్తి legacy contact ని రిజిస్టర్ చేయకుండా ఉంటే లేదా ఒక వేల చనిపోయిన వ్యక్తి తన ప్రొఫైల్ సెట్టింగ్స్ లో చనిపోయిన తర్వాత అకౌంట్ డిలీట్ అవ్వాలని choose చేసుకోక పొతే కుటుంబ సభ్యులు గాని, స్నేహితులు గాని అకౌంట్ ని memorialized account గా మార్చమని లేదా అకౌంట్ ని డిలీట్ చేయమని లేదా చనిపోయిన వ్యక్తి యొక్క ఫోటోలు, డేటా కావాలని ఫేస్ బుక్ ని కోరవచ్చు. .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *