Incognito మోడ్ సదుపాయం ఇక గూగుల్ మ్యాప్స్ కి కూడా రానుంది

గూగుల్ క్రోమ్, యూట్యూబ్ లో ఉన్న Incognito మోడ్ సదుపాయం గూగుల్ మ్యాప్స్ కి కూడా తీసుకువస్తున్నట్లు గూగుల్ వెల్లడించింది. కొన్ని వారాలలో ఈ సదుపాయం ఆండ్రాయిడ్ కి రానుంది. తర్వాత ఆపిల్ ios కి రిలీజ్ చేస్తారు.

మే నెలలో జరిగిన గూగుల్ కాంఫరెన్సులో గోప్యత, పారదర్శకతకి సంబంధించి కొన్ని టూల్స్ తీసుకువస్తామని గూగుల్ ప్రకటించింది. అందులో భాగంగానే ఇది.

Incognito మోడ్ అంటే ఏమిటి?

మనం గూగుల్ క్రోమ్ లో కానీ, యూట్యూబ్ లో కానీ Incognito మోడ్ ఆన్ చేసి బ్రౌజ్ చేసినట్లయితే బ్రౌజింగ్ హిస్టరీ రికార్డు అవ్వదు. కుకీస్ స్టోర్ చేయబడవు. కానీ ఐపీ అడ్రస్, లొకేషన్, మనం వాడుతున్న బ్రౌజర్,ఆపరేటింగ్ సిస్టం లాంటి వివరాలు మనం వాడుతున్న ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ కి, మనం ఓపెన్ చేసిన వెబ్సైట్ కి, థర్డ్ పార్టీ సర్వీసెస్ కి కనపడతాయి.

ఇతరులు మన ఫోన్ లేదా కంప్యూటర్ వాడేటప్పుడు మనం బ్రౌజింగ్ హిస్టరీ వారికి కనపడకుండా ఉండడానికి మాత్రమే Incognito మోడ్ ఉపయోగపడుతుంది.

ఈ Incognito మోడ్ గూగుల్ మ్యాప్స్ లో ఆన్ చేస్తే మనం తిరిగిన లొకేషన్, వెదికిన లొకేషన్ హిస్టరీ రికార్డు అవ్వదు. కానీ లొకేషన్ డీటెయిల్స్ ని గూగుల్ మరియు థర్డ్ పార్టీ సర్వీసెస్ యాడ్స్ కోసం, మార్కెటింగ్ కోసం ట్రాక్ చేస్తూనే ఉంటాయి.

గూగుల్ తీసుకురాబోతున్న మరి కొన్ని టూల్స్

  • గూగుల్ క్రోమ్ లో ఆటో డిలీట్ హిస్టరీ అనే ఆప్షన్ ని కూడా తీసుకురానున్నట్లు గూగుల్ తెలిపింది. యూట్యూబ్ అప్ లో ఈ ఆటో డిలీట్ హిస్టరీ అనే ఆప్షన్ ఇంతకు ముందే వుంది. ఈ ఆప్షన్ ఆన్ చేస్తే బ్రౌజింగ్ హిస్టరీ 3 లేదా 18 నెలల తర్వాత ఆటోమేటిక్ గ డిలీట్ అవుతుంది.

  • ఈ మధ్య హ్యాకర్ల దాడులు, యూజర్ డేటా లీకులు ఎక్కువయ్యాయి. దీనికోసం గూగుల్ పాస్వర్డ్ చెక్ అప్ టూల్స్ ని తీసుకురాబోతుంది. దీని వల్ల మన పాస్వర్డ్ లీక్ అయిందా లేదా అని తెలుసుకునే అవకాశం ఉంటుంది.
ఇతరులకు షేర్ చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *