ఫేక్ న్యూస్ ని ఎలా కనిపెట్టాలి?

This article is about how to identify fake news in Telugu. To identify fake news in Telugu, we have provided you some tools.

ఫేక్ న్యూస్ అంటే ఏమిటి?


ఫేక్ న్యూస్ అంటే అబద్ధపు వార్త. లేని వార్తలను, అసత్యాలను, పుకార్లను కొంతమంది క్రియేట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ ఫేక్ న్యూస్ కొన్ని గంటల వ్యవధిలోనే వైరల్ గా మారి అందరికీ తెలిసిపోతుంది. ఇది అబద్దం అని తెలుసుకోలేని జనాలు ఇతరులకు షేర్ చేస్తూనే ఉంటారు.

నిజాలను (వాస్తవాలను) కాకుండా అబద్ధాలనే జనాలు ఎక్కువగా నమ్ముతున్నారు.

ఈ ఫేక్ న్యూస్ కి ఉండే లక్షణాలు

  • ఫేక్ న్యూస్ ఎప్పుడు కూడా ప్రజలలో భయాందోళనలు కలిగించేదిగా ఉంటుంది.
  • ప్రజలలో ఆసక్తిని రేకెత్తించే విధంగా ఉంటుంది.
  • చాలా ఎమోషనల్ గాను, మోటివేషనల్ గాను ఉంటుంది.
  • ఇతరులకు షేర్ చేయమని ప్రోత్సహించేలా ఉంటుంది.

ఈ ఫేక్ న్యూస్ వల్ల జరిగే నష్టాలు

  • ఫేక్ న్యూస్ సమాజంలో భయాందోళనలు క్రియేట్ చేస్తుంది.
  • కొన్ని వర్గాల మధ్య, మతాల మధ్య, కులాల మధ్య విద్వేషాలను రెచ్చకొడుతుంది.
  • సైబర్ నేరాలు జరుగుతాయి.

ఫేక్ న్యూస్ వల్ల నష్టాలు తప్ప లాభాలు ఏమీ లేవు.

ఫేక్ న్యూస్ ని ఈ విధంగా కనిపెట్టండి.(How to identify fake news in Telugu)

సోషల్ మీడియా Platforms ఫేక్ న్యూస్ ని ఆపడానికి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, అవి పూర్తిగా ఫేక్ న్యూస్ ని వైరల్ అవ్వకుండా ఆపలేకపోతున్నాయి. కానీ సోషల్ మీడియాని వాడే మనం ఫేక్ న్యూస్ ని కనిపెట్టి, ఫేక్ న్యూస్ వైరల్ అవ్వకుండా ఆపవచ్చు.

సోషల్ మీడియాలో వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్ అవునో, కాదో తెలుసుకోవాలంటే ఈ టిప్స్ పాటించండి.

1. Use common sense and Identify the source

మనం ఏదైనా న్యూస్ సోషల్ మీడియా లో చూసినప్పుడు ఆ న్యూస్ Main stream media లో వచ్చిందో లేదో తెలుసుకోవాలి.
Main stream media అంటే డైలీ మనం చదివే న్యూస్ పేపర్లు మరియు చూసే టీవీ చానల్స్.
న్యూస్ పేపర్స్ మరియు టీవీ చానల్స్ లో కాకుండా సోషల్ మీడియాలో మాత్రమే ఈ న్యూస్ వైరల్ అవుతుంది అంటే అది కచ్చితంగా ఫేక్ న్యూస్.

2. ఈ టూల్స్ ని ఉపయోగించి ఫేక్ న్యూస్ ని కనిపెట్టండి.

(A) List of websites to check fake news

(B) List of Apps to check fake news

పైన తెలిపిన టూల్స్ / యాప్స్ వాడి ఫేక్ న్యూస్ ని identify చేయండి.

సోషల్ మీడియాలో వచ్చే ఏదైనా న్యూస్ ని షేర్ చేసేటప్పుడు ఫేక్ న్యూస్ అవునో, కాదో తెలుసుకుని షేర్ చేయండి.

Say No to Fake news.

ఇతరులకు షేర్ చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *