How to link PAN Card with Aadhar? Stet by step Process in Telugu

పాన్ కార్డు ని ఆధార్ కార్డుతో లింక్ చేయడం తప్పనిసరని భారత ప్రభుత్వం గత బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఉత్తర్వులు జారీ చేసింది.

లింక్ చేయడానికి ముందుగా సెప్టెంబర్ 30, 2019 ని ఆఖరి తేదిగా ప్రకటించింది.

కానీ మళ్ళీ లింక్ చేయడానికి డిసెంబర్ 31, 2019 ని ఆఖరి తేదీగా గడువును పెంచింది.

గవర్నమెంట్ ఎందుకు పాన్ కార్డు ని ఆధార్ కార్డుతో లింక్ చేయాలనుకుంటుంది?

  • పెద్దమొత్తం లో జరుగుతున్నా లావాదేవీలపై నిఘా ఉంచడానికి.

  • ఆదాయపు పన్ను ని ఎగవేయకుండా ఉండడానికి.

  • ఆదాయపు పన్ను రిటర్న్స్ ని (ITR- Income Tax Returns) దాఖలు చేయడం సులభ తరం చేయడానికి.

  • ఒక వ్యక్తి పేరు మీద ఒకటి కన్నా ఎక్కువ పాన్ కార్డు లు లేకుండా చేయడానికి.

గవర్నమెంట్ ఇచ్చిన గడువు లోగా పాన్ కార్డు ని ఆధార్ కార్డుతో లింక్ చేయక పొతే ఏమవుతుంది?

  • గవర్నమెంట్ ఇచ్చిన గడువు లోగా పాన్ కార్డు ని ఆధార్ కార్డుతో లింక్ చేయక పొతే పాన్ కార్డు ని మనం ఉపయోగించలేము, Disable అయిపోతుంది.

  • 50,000 పైబడి లావాదేవీలు జరగాలంటే తప్పనిసరిగా లింక్ చేయాలి.

  • ఆదాయపు పన్ను రిటర్న్స్ ని (ITR- INCOME TAX RETURNS) దాఖలు చేయడం సాధ్యం కాదు.

పాన్ కార్డు ని ఆధార్ కార్డుతో ఎలా లింక్ చేయాలి?

పాన్ కార్డు ని ఆధార్ కార్డుతో రెండు విధాలుగా లింక్ చేయవచ్చు. ఆన్లైన్ ద్వారా మరియు SMS ద్వారా లింక్ చేయవచ్చు.


ఆన్లైన్ ద్వారా ఇలా లింక్ చేయండి.


ఈ లింక్ పై క్లిక్ చేసి incometaxindiaefiling income టాక్స్ e-filing వెబ్ సైట్ ని ఓపెన్ చేయండి.

  • మీ పాన్ నెంబర్ ని ఎంటర్ చేయండి.

  • మీ ఆధార్ కార్డు నెంబర్ ని ఎంటర్ చేయండి.

  • ఆధార్ కార్డు లో ఉన్నట్టుగా మీ పేరును ఎంటర్ చేయండి.

  • మీ ఆధార్ కార్డు లో కేవలం పుట్టిన సంవత్సరం మాత్రమే మీరు నమోదు చేసినట్లయితే టిక్ చేయండి.

  • Display అవుతున్న CAPTCHA కోడ్ ని ఎంటర్ చేయండి.

  • ఒక వేల కంటి చూపు లేని వారు CAPTCHA బదులు OTP ఆప్షన్ ని వాడుకోవచ్చు.

  • దాని కోసం Request OTP ని టిక్ చేయాలి.

  • తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి.

  • చివరిగా Link Aadhar అనే బటన్ పై క్లిక్ చేయండి.

  • అంతే Aadhaar will be successfully linked with your PAN అనే popup మెసేజ్ ని మనం చూడవచ్చు.

SMS ద్వారా ఇలా లింక్ చేయండి.

  • ఈ మెసేజ్ ని టైపు చేయండి.
  • UIDPAN<12 Digit Aadhaar> <10 Digit PAN>
    ఉదాహరణకి UIDPAN 123456789012 ABCDE1234A

  • 567678 లేదా 56161 అనే నంబర్లకు sms పంపించండి.
  • పాన్ కార్డు లో ఉన్న వివరాలు, ఆధార్ కార్డు లో ఉన్న వివరాలు మ్యాచ్ అయితేనే విజయవంతంగా లింక్ అవుతుంది.

  • ఒక వేల లింక్ అవ్వకుంటే ఆధార్ కార్డు లోని లేదా పాన్ కార్డు లోని వివరాలని అప్డేట్ చేయండి.

ఆధార్ కార్డు తో పాన్ కార్డు లింక్ అయ్యిందో లేదో స్టేటస్ ని ఎలా తెలుసుకోవాలి?


ఈ అడ్రస్ పై క్లిక్ చేయండి.

https://www1.incometaxindiaefiling.gov.in/e-FilingGS/Services/AadhaarPreloginStatus.html

పాన్ కార్డు నెంబర్, ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేయండి.

View link Aadhaar status అనే బటన్ ని క్లిక్ చేయండి.
Your PAN is linked అనే message కనిపిస్తే లింక్ అయినట్లే.

ఇతరులకు షేర్ చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *