How to Take money from deceased family member’s bank account?

మరణించిన వ్యక్తి యొక్క బ్యాంకు అకౌంట్లోని డబ్బుని కుటుంబ సభ్యులు ఎలా తీసుకోవాలి?

ఒక వ్యక్తి మరణం ఆ కుటుంబములో తీరని విషాదాన్ని, తీరని లోటుని మిగుల్చుతుంది. కాలమే ఆ గాయాన్ని మాన్పుతుంది.

కొన్ని రోజుల తర్వాత కుటుంబ సభ్యులు మరణించిన వ్యక్తి యొక్క ఆర్ధిక లావాదేవీలు (అప్పు ఇవ్వడం, అప్పు తీసుకోవడం), ఆ వ్యక్తి పేరు మీదున్న ఆస్తులు, ఇన్సూరెన్స్ పాలసీలు, మ్యూచువల్ ఫండ్స్ (Mutual Funds) , ఫిక్సడ్ డిపాజిట్లు (Fixed Deposits), బ్యాంకు అకౌంట్లు మొదలైన వివరాలు తెలుసుకుంటారు.

మ్యూచువల్ ఫండ్స్, ఫిక్సడ్ డిపాజిట్లు, ఇన్సూరెన్స్ పాలసీలు, ప్రోవిడెంట్ ఫండ్స్ వంటివన్నీ కూడా బ్యాంకు అకౌంటికి లింక్ అయి ఉంటాయి.

మరణించిన వ్యక్తి యొక్క బ్యాంకు అకౌంట్లోని డబ్బుని కుటుంబ సభ్యులు ఎలా తీసుకోవాలి? అనే వివరాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

సాధారణంగా రెండు రకాల బ్యాంకు అకౌంట్లు ఉంటాయి.

  1. సింగిల్ అకౌంట్ (Single Account)
  2. జాయింట్ అకౌంట్ (Joint Account )

మరణించిన వ్యక్తి సింగిల్ అకౌంట్ కలిగి ఉంటే ఏమి చేయాలి?

మొదటగా బ్యాంకుకి వెళ్లి అధికారులకు వ్యక్తి మరణం గురించి తెలియచేయాలి. నామినీ రిజిస్టర్ అయి ఎవరైనా ఉంటే ఆ వ్యక్తికి బ్యాంకు డబ్బును చెల్లిస్తుంది.

నామినీ బ్యాంకుకి సమర్పించవలసిన డాక్యూమెంట్లు

  • బ్యాంకు అప్లికేషన్
  • మరణించిన వ్యక్తి యొక్క డెత్ సర్టిఫికెట్
  • ఆధార్ కార్డు, ఓటర్ కార్డు మొదలగు KYC (Know Your Customer) డాక్యూమెంట్ల ఫోటో కాపీలు
  • మరణించిన వ్యక్తితో గల సంబంధాన్ని తెలిపే ఆధారం
  • FIR కాపీ ( ఒక వేల ఆక్సిడెంట్లో మరణిస్తే )

నామినీ రిజిస్టర్ అయి లేకపోతే

  • బ్యాంకు కి ఎవరు మరణించిన వ్యక్తి యొక్క నిజమైన వారసులో (చట్ట బద్దమైన వారసులు) తెలపాల్సి ఉంది.
  • ఒక వేల మరణించిన వ్యక్తి వీలునామా రాసి ఉంటే వీలునామా ప్రకారం బ్యాంకు కుటుంబ సభ్యులకు డబ్బును చెల్లిస్తుంది.
  • వీలునామా లేకపోతే కోర్ట్ ద్వారా చట్ట పరమైన వారసులు ఎవరో బ్యాంకుకి తెలపాల్సి ఉంది. దాని కోసం కోర్ట్ నుండి Succession Certificate తీసుకోవాలి.

మరణించిన వ్యక్తి జాయింట్ అకౌంట్ కలిగి ఉంటే ఏమి చేయాలి?

ఇద్దరు వ్యక్తులు కలిసి ఈ అకౌంట్ ఓపెన్ చేస్తారు. ఈ అకౌంట్ కి కూడా నామినీ ని రిజిస్టర్ చేయవచ్చు.బ్రతికున్న వ్యక్తి లేదా నామినీ బ్యాంకుని సంప్రదించి డబ్బును పొందవచ్చు.

బ్యాంకుకి సమర్పించవలసిన డాక్యూమెంట్లు

  • బ్యాంకు అప్లికేషన్
  • మరణించిన వ్యక్తి యొక్క డెత్ సర్టిఫికెట్
  • ఆధార్ కార్డు, ఓటర్ కార్డు మొదలగు KYC (Know Your Customer) డాక్యూమెంట్ల ఫోటో కాపీలు
  • మరణించిన వ్యక్తితో గల సంబంధాన్ని తెలిపే ఆధారం
  • FIR కాపీ ( ఒక వేల ఆక్సిడెంట్లో మరణిస్తే )

ఒక వేల నామినీకి, కుటుంబ సభ్యులకు లేదా నామినీకి, జాయింట్ అకౌంట్ కలిగి ఉన్న బ్రతికున్న వ్యక్తి కి విభేదాలుంటే కోర్ట్ కి వెళ్ళాలి. కోర్ట్ నిజమైన వారసులు ఎవరో తేల్చి Succession Certificate ని ఇస్తుంది. కోర్ట్ తెలిపిన చట్ట బద్దమైన వారసులకే బ్యాంకు డబ్బును చెల్లిస్తుంది.

బ్యాంకు అకౌంట్ కలిగి ఉన్న వ్యక్తి మరణిస్తే ఆ విషయం బ్యాంకుకి తెలియకపొతే లేదా మనం బ్యాంకు అకౌంట్ ని వాడడం మానేస్తే అకౌంట్లో డబ్బు ఏమవుతుంది?

  • బ్యాంకు అకౌంట్ కలిగి ఉన్న వ్యక్తి మరణిస్తే లేదా మనం బ్యాంకు అకౌంట్ ని వాడడం మానేస్తే అకౌంట్ ద్వారా ఏ లావాదేవీలు జరగవు కాబట్టి కొన్ని నెలల తర్వాత బ్యాంకు అకౌంట్ inactive దశలోకి వెళ్ళిపోతుంది. దీన్నే బ్యాంకు అకౌంట్ చచ్చిపోయింది అంటుంటారు.
  • ఇంకా కొన్ని సంవత్సరాల తర్వాత అకౌంట్లో ఉన్న డబ్బు మొత్తం రిజర్వు బ్యాంకు కి (Investor Education and Protection Fund) బదిలీ చేయబడుతుంది.
  • తర్వాత నామినీగాని, చట్ట పరమైన వారసులు గాని బ్యాంకు ని సంప్రదించి డబ్బును కోరితే రిజర్వు బ్యాంకు నుంచి డబ్బు వెనక్కి వస్తుంది.

మనం మరణించినపుడు మన కుటుంబ సభ్యులకు మన బ్యాంకు అకౌంట్లోని డబ్బు సులభంగా దక్కాలంటే ఏమి చేయాలి?

  • కొత్తగా ఏదైనా బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు కచ్చితంగా కుటుంబ సభ్యుల్లో ఎవరి నైనా నామినీ గా రిజిస్టర్ చేయండి.
  • ఒక వేల ఇప్పటికే నామినీని రిజిస్టర్ చేయకపొతే తక్షణమే బ్యాంకుకి వెళ్లి నామినీని రిజిస్టర్ చేయిచండి.
  • జీవిత భాగస్వామ్యులు ఇద్దరు కలిసి జాయింట్ అకౌంట్ ఓపెన్ చేయండి.
  • మనం చనిపోయిన తర్వాత కుటుంబ సభ్యుల మధ్య ఆస్తి కోసం గొడవలు రాకుండా ఉండాలంటే ఎవరికి ఇవ్వవలిసిన వాటాన్ని వారికి ఇవ్వడానికి వీలునామాని బ్రతికున్నప్పుడే రాయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *