INX Media scam explained in Telugu

INX మీడియా కేసు పూర్తి వివరాలు

INX మీడియా సంస్థని ఇంద్రాణి ముఖర్జీ, పీటర్ ముఖర్జీ అనే ఇద్దరు భార్యాభర్తలు 2007 వ సంవత్సరంలో స్థాపించారు.

ఈ మీడియా సంస్థని విస్తరించటానికి వీళ్ళు నిధుల కోసం వెతకగా కొన్ని విదేశీ సంస్థలు పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చాయి.

మన దేశంలో విదేశీ పెట్టుబడులను నియంత్రించడానికి FIPB (Foreign Investment Promotion Board) అనే ప్రభుత్వ సంస్థ ఉంది.

విదేశీ పెట్టుబడులను తీసుకోవడానికి ఈ FIPB యొక్క అనుమతి తప్పనిసరి. FIPB ఈ సంస్థకి 4 కోట్ల విదేశీ పెట్టుబడులను తీసుకోవడానికి మాత్రమే అనుమతిని ఇచ్చింది.

కానీ ఐఎన్ఎక్స్ మీడియా సంస్థ 305 కోట్ల పెట్టుబడులను తీసుకుంది. అలాగే ఐఎన్ఎక్స్ న్యూస్ అనే స్వంత సంస్థకి FIPB నిబంధనలకు విరుద్ధంగా నిధులను మల్లించింది.

మాజీ ఆర్ధిక మంత్రి చిదంబరం అరెస్ట్ పూర్తి వివరాలు

  • కొన్ని నెలల తర్వాత 2008 లో ఈ వ్యవహారాన్ని గమనించిన FIPB ఐఎన్ఎక్స్ మీడియాకి నోటీసులు పంపి వివరణ కోరింది.
  • ఈ సమయంలోనే ఐఎన్ఎక్స్ మీడియా కార్తీ చిదంబరాన్ని ఆశ్రయించింది.అప్పటి కేంద్ర ఆర్ధిక మంత్రి అయిన పి. చిదంబరం గారి కుమారుడే ఈ కార్తీ చిదంబరం.
  • కార్తీ చిదంబరం చెస్ మానెజ్మెంట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకి యజమాని.
  • కార్తీ చిదంబరం ఐఎన్ఎక్స్ మీడియా సంస్థని FIPB కి 305 కోట్ల పెట్టుబడులకు అనుమతి కోసం మళ్ళీ దరఖాస్తు చేయించి తన తండ్రి అధికారాన్ని ఉపయోగించి ఐఎన్ఎక్స్ మీడియాని FIPB నుండి కాపాడారని, ఐఎన్ఎక్స్ మీడియా నుండి లంచం తీసుకున్నారని ఆయనపై అభియోగాలు ఉన్నాయి.
  • మళ్ళీ 2008 లో కొన్ని నెలల తర్వాత FIU (Financial Intelligence Unit) అనే ప్రభుత్వ ఆర్ధిక నిఘా సంస్థ ఈ నిధుల మళ్లింపు వ్యవహారంలోని లోపాలు కనిపెట్టింది.
  • 2010 లో ఈడీ (Enforcement Directorate) కేసుని రిజిస్టర్ చేసింది. మళ్ళీ 2017 లో ఈ సారి సీబీఐ (Central Bureau of Investigation) ఎఫ్ఐర్ ని నమోదు చేసి విచారణ ప్రారంభించింది. దీనిలో భాగంగానే 2018 లో సీబీఐ కార్తీ చిదంబరాన్ని అరెస్ట్ చేసి 23 రోజులు జైల్లో ఉంచింది. తర్వాత కార్తీ చిదంబరం బెయిల్ పై విడుదల అయ్యాడు.
  • 2019 లో ఇంద్రాణి ముఖర్జీ తన కూతురుని చంపిన కేసులో అరెస్ట్ అయి జైలుకి వెళ్లి ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అప్రూవర్ గా మారిపోయింది. ఆమె చెప్పిన సమాచారం ఆధారం గానే ఆగస్టు నెలలో మాజీ కేంద్ర ఆర్ధిక మంత్రి పి. చిదంబరాన్ని సీబీఐ తన కస్టడీలోకి తీసుకుని విచారిస్తుంది. ప్రస్తుతం అయన తీహార్ జైల్లో ఉన్నారు.

చిదంబరం అలాగే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు దీన్ని బీజేపీ ప్రభుత్వం యొక్క కక్ష సాధింపుగా చెప్పుకొస్తున్నారు.

అలాగే చిదంబరం మరియు తన కుమారుడిపై ఇంకొక కేసు Aircel Maxis డీల్ కేసు కూడా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *