ఫేస్ బుక్ లైక్స్ ని హైడ్ చేయనున్నట్లు ప్రకటించింది

  • సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ ఒక సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. ఒక పోస్టుకి వచ్చే లైక్స్ ని, రియాక్షన్స్ ని, వీడియో వ్యూస్ ని ఫేస్ బుక్ త్వరలో హైడ్ చేస్తుందంట.
  • కేవలం పోస్ట్ పెట్టిన వారికే లేదా వీడియో పోస్ట్ చేసిన వారికే మాత్రమే లైక్స్, రియాక్షన్స్, వీడియో వ్యూస్ కనిపిస్తాయి. ఆ పోస్ట్ ని చూసే వారికి ఇవేవి కనిపించవని ఫేస్ బుక్ తెలిపింది.
  • ఇది ప్రయోగ దశలో వుంది. సెప్టెంబర్ నెల 27 వ తారీకు నుంచి ఆస్టేలియాలో ఫేస్ బుక్ లైక్స్ ని హైడ్ చేయడం మొదలు పెట్టింది.

  • అక్కడి యూజర్ల అనుభవాలను తెలుసుకుని మార్పులు, చేర్పులు ఏమైనా ఉంటే చేసి మిగతా దేశాల యూజర్లకు కూడా లైక్స్ ని హైడ్ చేయనున్నట్లు ఫేస్ బుక్ ప్రకటించింది.

  • ఫేస్ బుక్ ఇంతకు ముందే జులై నెలలో తన సోషల్ మీడియా ఆప్ ఇంస్టాగ్రామ్ లో లైక్స్ ని హైడ్ చేయడం ప్రారంభించింది. ప్రస్తుతం 7 దేశాలలో ఇంస్టాగ్రామ్ లైక్స్ ని హైడ్ చేసింది.
  • ఆ ఏడు దేశాలు ఏవనగా ఆస్ట్రేలియా, కెనడా, బ్రెజిల్, న్యూజీలాండ్, ఐర్లాండ్, ఇటలీ, మరియు జపాన్.

ఎందుకు ఫేస్ బుక్ లైక్స్ ని ఇతరులకు కనిపించకుండా ఈ నిర్ణయం తీసుకుంది?

  • ఎక్కువగా పేస్ బుక్ వాడడం వలన మానసిక ఆరోగ్యం దెబ్బతింటుందని కొన్ని పరిశోధనల ద్వారా మానసిక ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు.

  • కాలిఫోర్నియా విశ్వ విద్యాలయం ఫేస్ బుక్ వాడుతున్న టీనేజర్స్ మీద పరిశోధనలు చేసింది.

  • పరిశోధనల్లో తేలిందేంటంటే టీనేజర్స్ ఎక్కువ లైకులు వున్న పోస్టులను మాత్రమే లైక్ చేస్తున్నారు. తక్కువ లైకులు వున్న పోస్టులు మంచివి కాదన్నట్టు, తక్కువ లైకులు ఉంటే సమాజం వాటిని అంగీకరించనట్టుగా వాళ్ళు భావిస్తున్నారు.

  • ఎక్కువ లైకులు వచ్చిన వారిని చూసి అసూయ చెందడం, ఇతరులతో పోల్చుకోవడం, మానసికంగా నిరాశ చెందడం, తనను తాను తక్కువగా ఊహించుకోవటం చేస్తున్నారు. ఒక వేల తమ పోస్టులకు తక్కువ లైకులు వస్తే వాటిని డిలీట్ చేయడం జరుగుతుంది.

ఇలాంటి విషయాలను దృష్టిలో పెట్టుకుని ఫేస్ బుక్ వాడుతున్న వారి మానసిక స్థితి చెడిపోకుండా మార్క్ జుకర్ బెర్గ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు అనిపిస్తుంది.

ఇతరులకు షేర్ చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *